వైసీపీ ఎప్పడు రివైవ్ అవుతుంది అంటే?
వైసీపీ తిరిగి నిలబడాలంటే మూడు రాజధానులు, ఉచితాల రాజకీయాలు, బూతు సంస్కృతి, మతపరమైన ఇమేజ్, రౌడీ రాజకీయాలపై నిజాయితీగా మార్పు అవసరం అన్న గమనిక.

మూడు రాజధానులు తప్పు, ఇక నుండి ఒకే రాజధాని అని ఒప్పుకున్న రోజు
అభివృద్ధి ని పక్కన బెట్టి ఎక్కువ ఉచితాలు వల్ల నష్టం జరిగింది అని ఒప్పుకుంటే
బూతు మినిస్టర్స్, బూతు MLA లు, బూతు సోషల్ మీడియా IT సెల్ ల వల్ల చాలా నష్టం జరిగింది, ఇది మార్చుకోవాలి అని తెలుసుకున్న రోజు
హిందూ వ్యతిరేక విధానాలు పక్కన బెట్టి, వైసీపీ క్రిస్టియన్స్ పార్టీ కాదు అని ప్రూవ్ చేసుకున్న రోజు
రౌడీలు, కూని కోరులను, చిల్లర గుండాలను దూరం పెట్టి రాజకీయం మాత్రమే చేసిన రోజు
ఇవి అన్ని వైసీపీ నాయకత్వం మార్చుకుంటారు అని నేను అనుకోను, జగన్ కి అహం చాలా ఎక్కువ. ఇవన్నీ మారినా ప్రజలు నమ్మడం అంత సులువు కాదు.
ఇవన్నీ మారి ప్రజల పార్టీ గా ఉన్న రోజు, పొత్తులు ఎన్ని ఉన్నా గెలిచే అవకాశం ఉంటాది. పార్టీ తప్పులు సరి చేసుకోకుండా ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆశ పెట్టుకుంటే వైసీపీ గెలిచే అవకాశం లేదు.
ఒక్క అవకాశం అని అడిగితే ఎంత దయ తలిచి ఇచ్చారో, అలాంటి అవకాశాన్ని అహంకారం తో కోల్పోతే ఇంకొక్కసారి అని ఎంత అడుక్కున్నా ప్రజలు ఇవ్వరు అనే విషయం రాబోయే రోజుల్లో తెలుసుకుంటారు.
మరో ఘోర ఓటమి వచ్చినప్పుడు మాత్రమే వైసీపీ శ్రేణులు రియాలిటీ కి వస్తారు. అంత వరకు పొత్తు విడిపోతుంది అని ఆశతో బతుకుతారు!!!
Remember, Hope is not a strategy!!!
పంచుకోండి
వ్యాఖ్యలు
ఒక్కసారి ఇమెయిల్ ధృవీకరణ అవసరం. ఆమోదించిన వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తాయి; ఇమెయిల్ చిరునామాలు కనిపించవు.
ఇంకా ఆమోదించిన వ్యాఖ్యలు లేవు.