పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నాను?
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం, జనసేన లక్ష్యం, పార్టీ విస్తరణపై ఆయన వైఖరి, మద్దతుదారుల అంచనాలు, మిత్రపక్షాల రాజకీయ గణితం పరిచయం ఒక వ్యక్తిగత విశ్లేషణ.

పవన్ కళ్యాణ్ ఎవరు?
సింపుల్ గ చెప్పాలంటే. మానవత్వం మూర్తీభవించిన, శ్రీ శ్రీ చెప్పినట్టు నేను సైతం సమాజం కోసం సమిదిని అయ్యాను అన్నట్టు ఎంతో కొంత ఈ సమాజానికి ఇవ్వాలనుకునే వ్యక్తి. వీటితో పాటు పుష్కలంగా దేశభక్తి , ఈ రాజకీయ వ్యవస్థలో కొన్ని విలువలు ,రాజకీయ నాయకులు, మీడియా, సమాజం జవాబుదారీతనం తో బాధ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి. డబ్బు వెనకపడి వందల వేల కోట్లు తన వెనకేసుకోవడం కన్నా సమాజంలో చరిత్రలో, గొప్ప ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తుండిపోవాలనుకునే ఆలోచన ఉన్న వ్యక్తి !!!
ఇప్పటికే ఉన్న పార్టీలో ఎందుకు చేరలేదు, కొత్త పార్టీ ఎందుకు పెట్టాడు?
పవన్ కళ్యాణ్ గారు బాగా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. అనేక విషయాల్లో గట్టి అభిప్రాయాలు ఉన్నాయి. ఏ ప్రాంతీయ లేదా జాతీయ పార్టీలోనూ అతను ఇమడలేడు. అధిష్టానాలు దగ్గర నచ్చని విషయాల్లో ఆర్డర్స్ తీసుకోవడం, వంగి వంగి దండాలు పెట్టుకుంటూ అతివినయాలతో ఉండటం కష్టమే. అందుకే సొంత పార్టీ పెట్టాడు. ఒకప్పుడు NGO (CMF) నడపాలనుకున్నాడు, కానీ కొన్ని NGO సేవలతో పెద్ద మార్పు రాదని తెలిసి వచ్చిందేమో!. ఆర్తిక నేర రాజకియలు, అవినీతి, జవాబుదారీతనం లేని రాజకియాలు, దారి తప్పిన వ్యవస్థలు, ఇలాంటి సమస్యలు NGO లతో అవ్వవు కాబట్టి రాజకీయ పార్టీ పెట్టి తనవంతు ప్రయత్నిద్దాం అనుకున్నారు ఏమో!!. సొంత పార్టీ అయితే ఆయన ఎవరికీ జవాబు చెప్పనవసరం లేదు, ఎందుకంటే అతని పార్టీకి అతనే పెద్ద దాత-సమయం, డబ్బు రెండిట్లోనూ. అతని నిబద్ధతను ఎవరు ప్రశ్నిస్తారు?. NGO లాగా కాకుండా రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపగలదు. ప్రభుత్వంలో భాగం అయితే ఇంకా ఎక్కువగా . అలాంటి అవకాశాలు ద్వారా నిజమైన సేవ, దీర్ఘకాలిక మార్పు రెండూ తేవచ్చు అనుకున్నారు ఏమో. ఆ మార్పులో ఆయనికి భాగస్వామ్యం ఉండాలనుకోవడం అయన స్వార్థం. అయన మనసుకి తృప్తి. నీతి నిజాయతీగా ప్రజాసేవ చేస్తే చరిత్రలో నిలిచిపోయే గొప్ప పేరు కూడా!!!
పవన్ కళ్యాణ్ పార్టీని ఎందుకు విస్తరించలేదు లేదా బలోపేతం చేయడానికి సిద్ధంగా లేరు?
కళ్యాణ్ గారి పార్టీ లక్ష్యం ప్రజలకు మంచి చేయడం. మూడో ప్రత్యామ్న్యాయం కాదు. ఎందుకంటే ఆయనికి మూడో ప్రత్యామ్నాయం నిర్మించడంలో ఆసక్తి లేదు. ఇలా చిన్నగా ఉండే NGO లాంటి పార్టీ తో ఆయన లక్ష్యం నెరవేరుతున్నప్పుడు ఎక్కువ ఎందుకు కష్టపడాలి?. మూడో ప్రత్యామ్నాయం నిర్మించడం అంటే యుద్ధం లాంటిది. అది చాల కష్టంతో కూడుకున్నది. వనరులు, దూరదృష్టి, శ్రద్ధ అవసరం. ఆయన పెద్ద నాయకుల నుండి చిన్న కార్యకర్తలు వరకు చాలా సమయం ఇవ్వాలి. తనకి వీలైంది ఇంతే. అంత మాత్రమే చెయ్యగలను అనుకొంటున్నారు. ఆయన లాగే ఏమి ఆశించకుండా పార్టీ లోకి వచ్చి సేవ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అందుకే అలా ఎవరూ రాకపోయినా ఆయనకేమి నష్టం లేదు అనే వైఖరి. కళ్యాణ్‌కి దీనికి మించి ఎక్కువ చెయ్యడం తన వల్ల కాదనిపిస్తుంది ఏమో. కళ్యాణ్ గారు తనలో ఆ సామర్థ్యం ఉందని నమ్మడం లేదు. ఉందని నమ్మినా , దానికోసమే ఇంతకన్నా మించి అంకితము అయ్యే సమయం ఇవ్వలేను అనుకొంటున్నారు. ఆయన సమయం ఇవ్వలేకపోయినా ఆయన లక్ష్యాల కోసం పని చేసే, కష్టపడే నాయకులకి ఆ బాధ్యతలు ఇచ్చి ఆయన పర్యవేక్షిస్తే సరిపోతుంది. కానీ అది చేయలేదంటే అలాంటివి చేస్తే సమయం వృధా అనుకున్నారు ఏమో. తనకు ఉన్న10-15 ఏళ్ళు ప్రజాసేవ చేసి రిటైర్ అయ్యి తనకి ఇష్టమైన పుస్తకాలూ చదువుకుంటూ గడిపెయ్యాలి అనుకున్నారు ఏమో!!!
వ్యాపార కుటుంబాలు, పెద్ద సంస్థల నుంచి ఫండింగ్ ఎందుకు తీసుకోవట్లేదు?
నచ్చని వాళ్ళ దగ్గర ఆయన ఫండింగ్ తీసుకొని మాట పడటం ఇష్టం లేదు అనుకుంటా. కొన్నిసార్లు కొత్తగా పార్టీలోకి వస్తాం అనే నాయకులూ ఎక్కువ ఖర్చు పెడతాము అన్నా, మూడో ప్రత్యామ్నాయం కోసం గట్టి ప్రయత్నాలు చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఇతరుల డబ్బును వృథా చేయడం ఎందుకని, అలా చేస్తే తప్పుడు ఆశలు కల్పించినవారం అవుతాం అని వద్దు అని తిరిగి పంపించేస్తున్నారు అందుకే అనుకుంటా. ఏదో ఆశించి ఫండింగ్ ఇవ్వాలనుకునే వారికి ప్రభుత్వంలో ఉండి లేదా రాజకీయం గా సహాయం చెయ్యకపోతే మోసం చేశాడని అపవాదు వస్తాది అని కూడా ఏమో.
మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు?
"మేము ఎవరు పల్లకీలు మొయ్యడానికి లేము", "ఎన్నోసార్లు తగ్గాము, ఈ సారి తగ్గం", “2024లో TDP ని నిలబెట్టాం”, “జనసేనను చిన్న పిల్లాడిలా కాపాడుకోవాలి”, “స్థానిక ఎన్నికల్లో మూడోవంతు ఖచ్చితంగా తీసుకుంటాం” లాంటి స్టేట్‌మెంట్లు ఎందుకు ఇస్తున్నారు?
ఎందుకంటే అతను తన NGO లాంటి పార్టీ జర్నీని ఎక్కువ కాలం కొనసాగించాలంటే, తన కోర్ మద్దతుదారులని సంతోషంగా ఉంచాలి. జనసేన అనేది ఆయన చేయాలనుకునే ప్రజాసేవకు ఒక వేదిక. జనసేన నిజంగా మూడో ప్రత్యామ్నాయం కోసం పని చేయడం లేదని లేదా పార్టీని బలోపేతం చేయడం లేదని ప్రజలు భావిస్తే, చాలామంది ఆ పార్టీతో సీరియస్‌గా కనెక్ట్ కారు. అది పార్టీని, కళ్యాణ్‌ని బలహీనం చేస్తుంది, ఆలా జరిగిన రోజున అతనికి ప్రభుత్వాలు, పార్టీలు కూడా పెద్దగా పట్టించుకోక పోవచ్చు. ఆయన గొంతుకి ఇప్పుడు ఉండే పదును తగ్గి పలచన అవుతారు.అలా అయితే, అతను ప్రభుత్వం ద్వారా పెద్ద స్థాయిలో ప్రజలకు సేవ చేయలేడు. అది జరగడం కళ్యానికి ఎంతమాత్రం ఇష్టం లేదు కాబట్టి అప్పుడుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మద్దతుదారుల్లో మూడో ప్రత్యామ్న్యాయం ఆశని అలాగే ఉంచుతారు!!!
ఎందుకు అందరూ పవన్ కళ్యాణ్‌ని రకరకాలుగా అర్థం చేసుకొని విమర్శిస్తున్నారు?
సినీ అభిమానులు, CULT ఫాన్స్ కి కళ్యాణ్ గారి విజయం కావాలి. సమాజంలో నిజమైన మార్పు లేదా దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాల పరిచయం పట్టించుకునే ఓపిక లేదు. వాళ్లకి కళ్యాణ్ ఎదో పదవిలో ఉండి సంతోషంగా ఎప్పుడూ ఏదో ఒక పాజిటివ్ స్టోరీస్ ఇస్తే చాలు.. వాళ్లకు ఏదో చిన్న విజయం దొరికినా సంబరపడిపోతారు. రాజకీయ మద్దతుదారులు మాత్రం ఆయన్ని మూడో ప్రత్యామ్నాయం కి నాయకుడిగా, చాణక్యుడిగా లేదా కేవలం గేమ్ ఛేంజర్‌గా కాకుండా రాష్ట్రాన్ని ఏలేవాడు గా అవ్వాలి అని కోరుకుంటారు. వ్యతిరేకులు అతన్ని NOBODY అని, సీరియస్‌గా తీసుకోనవసరం లేని వాడిగా లేదా ఇతర నాయకులకు బానిసగా చిత్రీకరించాలనుకుంటారు. వ్యతిరేకులకు భయం ఏంటంటే, అతని స్థిరమైన మద్దతు వల్ల రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు మారిపోతే, తాము మళ్లీ అధికారంలోకి రాలేమేమోనని.
TDP అతన్ని వాళ్లకి ఉపయోగపడే చిన్న పార్టీగా చూడాలనుకొని ఆలా ప్రోజెక్టు చేస్తారు. అంతేకాకుండా తమపై గొంతు ఎత్తకూడదు, ఒక స్థాయి దాటి పెరగకూడదు అని కోరుకుంటారు. ఒకవేళ కళ్యాణ్ గారు మిత్రపక్షంలో జరిగే తప్పులు, అవినీతి పరిచయం మాట్లాడితే, వాళ్లు అతను రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నాడని ఊహించుకొని ఆయన, ఆయన పార్టీ మీద పరోక్షంగానూ మరియు సోషల్ మీడియాతో దాడి చేస్తారు. కళ్యాణ్ గారు అప్పుడుడప్పుడు చేసే చురుకైన విమర్శలు లేదా వాస్తవాలు చెప్పడం మిత్రులకి అభద్రతని కలిగిస్తుంది. దానివల్ల అవకాశం దొరికినప్పుడల్లా అతన్ని దెబ్బతీయడానికి లేదా చిన్నబుచ్చడానికి ప్రయత్నిస్తారు.
ఆయన TDP పార్టీతో, దాని నాయకుడితో దీర్ఘకాల సంబంధం కోరుకునే వైఖరితో ఉంటె BJP మిత్రులు మూడో ప్రత్యామ్నాయం ఎప్పటికీ రాదు లేదా ఆలస్యమవుతుందని నిరాశపడతారు. అందుకే వాళ్ళు కూడా ఆయన్ని అప్పుడు అప్పుడు ఘూటుగాను, కోపంతోను విమర్శలు చేస్తూ ఉంటారు. అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టు. సొంత పార్టీలో కొందరి మద్దతుదారులకు నిరాశ ఎందుకంటే, TDP ఆయన్ని దూషించినా, వెన్నుపోటు పొడిచినా, ముందు పొగిడి వెనక క్యాంపెయిన్ నడిపినా, ఆయన పట్టించుకోకుండా మద్దతు ఇస్తున్నాడు అని. ఈ కృతజ్ఞత లేని మిత్రపక్షాల బానిసత్వం అవసరమా అని వాళ్లలో కొందరి బాధ. కానీ ఆయన భరించేది ఆయన చరిత్రలో నిలిచిపోవాలనో లేదా ప్రజలకి మంచి చెయ్యడం కోసమే అనుకోని ఊరుకోవడమే. ఆయన 3వ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలేదు అనుకుంటే ఇలాంటి లేనిపోని ఆశలు, నిరాశలు ఉండవు.
అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే?
అందరూ ఒక విషయం గుర్తిస్తే ఘర్షణ వాతావరం తగ్గిపోతుంది, కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పేరుతోNGO ని నడుపుతున్నాడు. సేవ చేస్తామనిNGO లు పేరుతో రాజకీయ లక్ష్యాలు కోసం పనిచేసే సంస్థలను చూసాను. నాకు తెలిసి రాజకీయ పార్టీ పేరుతో NGO ని నడుపుతున్నది కళ్యాణ్ గారు మాత్రమే ఏమో!!!
అలాంటి NGO TDP కి ఎప్పటికీ ముప్పు కాదు. JSP మద్దతుదారులని కాలక్రమేణా TDP మద్దతుదారులుగా మార్చేసే స్క్రిప్ట్ ఇది అని BJP మద్దతుదారులు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మూడో ప్రత్యామ్నాయం ద్వారా నేరుగా రాజకీయ మార్పు తీసుకురాలేక పోవచ్చు గాని BJP కి కళ్యాణ్ గారు జాతీయవాదం, సనాతన హిందూ సిద్ధాంత విస్తరణ పరంగా సాయం చేస్తున్నారు అనుకుంటా!!.
సొంత మద్దతుదారులు అతని సేవా ఉద్దేశాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు.TDP మిత్రులు అతని సహకారంతో రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం సాధించామని చెప్పుకోవచ్చు. BJP మిత్రులు అతని సిద్ధాంతపరమైన సహకారాన్ని తమ రాజకీయ లక్ష్యాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రత్యర్థులు కొంచెం నిరాశపడొచ్చు, కానీ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్లకి పవన్ కళ్యాణ్ కన్నా ఇప్పుడు వాళ్ళ నాయకుడి విధానాలు వల్లే ఎక్కువ ముప్పు. ఇలాగె కొనసాగితే, రాష్ట్రంలో కాంగ్రెస్ కి జీవం రావొచ్చు.
పవన్ కళ్యాణ్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి?
జనసేనను ప్రభావవంతమైన, బలమైన వేదికగా చేయడం. ప్రజలకు సేవ చేయడం. TDP, YCPలతో సమానంగా పెరిగి, స్వంతంగా పాలించే లేదా సీఎం అయ్యే అధికారం కోసం ప్రయత్నం చేయడం అయితే కాదుు. అలాంటివి అనుకోకుండా అయితే మంచిది అనుకుంటారు. పవన్ కళ్యాణ్ సొంత పార్టీ పూర్తి అధికార రాజకీయాల కోసం రాలేదు, అయినా అతను దాన్ని చేయగలడు, అధికారం చూడని సముదాయాలకు గొప్ప శక్తిని ఇవ్వగలడు అన్నది వేరే విషయం. కానీ అది చెయ్యకూడదు అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు అతనికి కావాల్సింది, నిజాయితీగా ప్రజాసేవ కోసం తమ సమయం, డబ్బు త్యాగం చేయగల వాళ్లు మాత్రమే. పార్టీ ద్వారా, అధికారం ద్వారా సంపాదించుకుని ఎదిగి, దాని ద్వారా పార్టీని బలపరిచేవాళ్ళు కాదు. అలా ఉండి ఏమి ఆశించకుండా ఆయన వెంట నడిచేవాళ్లే ఆయన వాళ్ళు. వేరే ఆలోచనలు ఉంటె అలాంటి వాళ్ళు ఆయనికి అవసరం లేదు. ఈ క్లారిటీ ఉండటం చాల ముఖ్యం. ధన్యవాదాలు🙏
జై హింద్
Raj Pattem
పంచుకోండి
వ్యాఖ్యలు
ఒక్కసారి ఇమెయిల్ ధృవీకరణ అవసరం. ఆమోదించిన వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తాయి; ఇమెయిల్ చిరునామాలు కనిపించవు.
ఇంకా ఆమోదించిన వ్యాఖ్యలు లేవు.