వ్యాసాలు

ప్రొఫెసర్ నాగేశ్వర్‌ని అరెస్ట్ చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోయుంటే ఏమయ్యేది?

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు, అరెస్ట్ ప్రయత్నం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత రాజకీయ నష్టం ఎలా తగ్గిందో ఒక విశ్లేషణ.

3 నిమిషాల చదువు
జనసేనపవన్ కళ్యాణ్ప్రొఫెసర్ నాగేశ్వర్రాజకీయాలు

(ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నాకు ఈ విధమైన ప్రేమ కానీ, ద్వేషం కానీ లేదు. ఆయన మంచోడా, చెడ్డోడా అన్నది కూడా నాకు అనవసరం. ఆయన ఎన్నో విషయాల్లో, ideologically గా కూడా నాకు విభేదిస్తాను.

కానీ ఇక్కడ. పోలీస్ కేసులు, రాజకీయ పరిణామ క్రమాలు ఎలా ఉంటాయో నా ఆసక్తి కొద్దీ నా ఆలోచనలు పంచుకున్నా).

పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర పోలీసులు ప్రొఫెసర్‌ని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్తే, ఆ విషయం తెలిసి అరెస్ట్ చేయొద్దని, ఏదో పొరబాటున మాట్లాడారని, మా వాళ్లు ఆవేశంలో కేసులు పెట్టారని, వెనక్కి తీసుకోమన్నానని చెప్పారు.

ఒకవేళ అలా చెప్పకుండా ఉంటే, ప్రొఫెసర్‌ని అరెస్ట్ చేసి ఉంటే ఏమయ్యేది? ముందుగా దేశం మొత్తం ఆంధ్ర వైపు తిరిగి చూసేది. ఒక source-based allegation తో వార్తల్లో కామెంట్లు చేసిన ప్రొఫెసర్ మీద కేసులు, అరెస్టులు అంటే చాలా తీవ్రమైన చర్య. అది అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది.

ఆయన కామెంట్లకి నేరుగా అరెస్ట్ చేయకూడదు. నోటీసు ఇచ్చి ఇన్వెస్టిగేషన్‌కి రమ్మనాలి. అరెస్ట్ కోసం తెలంగాణ పోలీసులు, మేజిస్ట్రేట్ ఆర్డర్‌తో రావాలి. ఇలాంటి కామెంట్స్ కేసుకి అలాంటి ఆర్డర్లు రావడం చాలా కష్టం. రాష్ట్రం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనేది వేరే విషయం, కానీ ప్రొఫెసర్ కామెంట్లకి ఆంధ్రలో అయినా, తెలంగాణలో అయినా మేజిస్ట్రేట్లు, జ్యుడిషియల్ వ్యవస్థ, పోలీసులు అరెస్ట్‌కి ఒప్పుకోవడం దాదాపు అసాధ్యం.

ఏదో చిన్న సామాన్య వ్యక్తి అయితే జరిగే అవకాశాలు ఉండేవి. ఒకవేళ ఇవన్నీ దాటుకుని అరెస్ట్ చేసినా గోల గోల అయ్యేది. దాంతో పాటు ప్రొఫెసర్‌కి మంచి లాయర్లు హైకోర్టులో quash లేదా anticipatory bail లాంటి పిటిషన్లు నిమిషాల్లో లేదా గంటల్లో వేసేవారు.

కోర్టు మొదట “అరెస్ట్ చేయొచ్చు, కానీ 41A నోటీసు మాత్రం ఇవ్వండి” అనేదో, లేక కేసు పెట్టిన వాళ్లని అడిగి “ప్రొఫెసర్ కామెంట్లలో పేర్లు వచ్చిన వ్యక్తులు కేసు పెట్టలేదు కదా? ఇవి రాజకీయ వ్యాఖ్యలు. ఎవరో పార్టీ వ్యక్తులు కేసు పెట్టడం టెక్నికల్‌గా valid కాదు” అని కొట్టేసే అవకాశం ఉండేది.

ఒకవేళ కేసు కొట్టకపోయినా, అరెస్ట్‌ని బ్లాక్ చేసేది. తర్వాత ప్రొఫెసర్ ఒకటి రెండు స్టేట్‌మెంట్లు ఇచ్చినా, లేదా వివరణ ఇచ్చినా సరిపోయేది. లేదంటే “నేను వెనక్కి తీసుకున్నాను” అన్నా సరిపోయేది. అది ఎటూ ముందుగానే చేశారు.

అరెస్ట్ చేసి ఉంటే JSPకి, పవన్ కళ్యాణ్ గారికే చెడ్డపేరు వచ్చేది. అరెస్ట్ అవ్వకుండా ఉండే అవకాశాలే ఎక్కువ. రాజకీయాల్లో అధికారాన్ని సామాన్యుల మీద exponential గా వాడితే, ప్రజలు సాధారణంగా సామాన్యుల వైపే నిలబడతారు.

ప్రొఫెసర్ మాట్లాడిన దాంట్లో తప్పు ఉన్నా, అరెస్టులు చేయడం సరైనదిగా సమాజం చూడదు. పైగా ఆయన హుందాగా వెనక్కి తీసుకున్నాక, దాన్ని ఇంకా నెగటివ్‌గా చూస్తారు.

నిజంగా కేసు పెట్టాలి అంటే, ప్రొఫెసర్ ప్రస్తావించిన వ్యక్తులు, ఇక్కడ కళ్యాణ్ గారు, మనోహర్ గారు defamation case పెడితే అది valid case అవుతుంది. దానికి అరెస్టులు ఉండవు. అప్పటికే apology చెప్పడమో, వెనక్కి తీసుకోవడమో చేయాల్సి వచ్చేది. అప్పటికే రాజకీయంగా జరగాల్సిన damage జరిగిపోయేది.

ప్రొఫెసర్ కూడా తన source ని reveal చేయాల్సిన పరిస్థితి వస్తే, ఆయన credibility దెబ్బతినేది. అందుకే ఆయన తెలివిగా, అలాగే కళ్యాణ్ గారు, మనోహర్ గారితో ఉన్న సంబంధాలు పాడవకూడదని వెనక్కి తీసుకుంటే, JSP కూడా “ఇది ముగిసిన అధ్యాయం” అన్నట్టు స్మార్ట్‌గా ముగించారు.

అధికారం ఉంది అని ఎలా పడితే అలా వాడితే రాజకీయాల్లో దెబ్బతింటారు. రాజకీయంగా least damage దారి చూసుకుని ప్రవర్తించాలి ఎప్పుడూ. కేసులు పెడితే, రేపు వేరేవాళ్లు misuse చేస్తే మాట్లాడే moral right కోల్పోతాం. రాజకీయాల్లో moral right అనేది చాలా ముఖ్యమైనది.

కానీ మరోక్క మాట, ఇలాంటి కేసుల్లో, అదీ మీడియాలో, రాజకీయ నాయకులకి బాగా పరిచయం ఉన్న ప్రొఫెసర్ లాంటి వ్యక్తిని ఆంధ్ర పోలీసులు తెలంగాణ వరకు ఆగమేఘాల మీద ఊరికే పోరు. పైన నుంచి ఆదేశాలు ఉంటే తప్ప. అది ఎవరు, ఏ స్థాయిలో ఉన్నవాళ్లు ఇచ్చి ఉంటారో మనకి తెలియదు.

కులం, ప్రాంతం మధ్య చిచ్చు అని, అల్లర్లు రేపుతున్నారు అని కేసులు పెట్టడం అన్నిటికన్నా హైలైట్. ఇలాంటి తప్పుడు కేసులు రాష్ట్రం మాత్రమే పెట్టగలదు, మామూలు వ్యక్తులు పెట్టలేరు.

అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇలా తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఎంత చెడ్డపేరు వస్తుందో, ముందు వెనక ఆలోచించకుండా పెట్టారు అంటే పై స్థాయి వ్యక్తుల influence లేకుండా ఇలాంటివి పెట్టరు.

ఒక CI, SI వాళ్లకు వాళ్లు నిర్ణయం తీసుకుని వెళ్లి అరెస్ట్ చేసే urgent కేసు అయితే కాదు. ఒక message పంపించడానికి అంత వరకు వెళ్లి వెనక్కి వచ్చారేమో అనుకుంటున్నా.

పంచుకోండి

వ్యాఖ్యలు

ఒక్కసారి ఇమెయిల్ ధృవీకరణ అవసరం. ఆమోదించిన వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తాయి; ఇమెయిల్ చిరునామాలు కనిపించవు.

ఇంకా ఆమోదించిన వ్యాఖ్యలు లేవు.

Visits--