వ్యాసాలు

దాసరి రాము గారి విమర్శలూ, కళ్యాణ్ గారి ప్రతి విమర్శల మీద నా ఆలోచనలు

దాసరి రాము గారి విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి ప్రతిస్పందన, జనసేనలో సామాజిక వర్గాల ప్రతినిధిత్వం, పవర్ షేరింగ్ మీద ఒక విశ్లేషణ.

4 నిమిషాల చదువు
జనసేనపవన్ కళ్యాణ్దాసరి రామురాజకీయాలు

దాసరి రాము గారు అంటున్న కమ్మలు, జనసేన వాళ్లని, జెఎస్పీ కాపుల్ని ఊర్లల్లో కేసులు పెట్టి, గొడవలు పెట్టి, సరైన గౌరవం లేకుండా, పదవులు లేకుండా తొక్కేస్తున్నారు, వాళ్ల బాధ వినే వాళ్లు లేరు అంటున్నారు?

కళ్యాణ్ దానికి నన్ను ఒక కులానికి పరిమితం చేసి మాట్లాడద్దు అంటున్నారు. చంద్రబాబు గానీ, జగన్‌ని గానీ వాళ్ల కులాల మీద దాడి చేస్తే, అణగతొక్కితే వాళ్ల కుల సంఘ నాయకులు వాళ్లని అడ్రెస్ చేయమని డిమాండ్ చేయట్లేదు కదా. దీన్ని పైకి చూస్తే అందరూ అగ్రి చేసే పాయింటే. నేను కూడా అదే అంటాను, కళ్యాణ్ కుల రాజకీయాలు చేయడానికి రాలేదు, దేశం అంటే, సమాజం అంటే ప్రేమతో వచ్చారు. నా లాంటోళ్లకి అలాంటి నాయకుడే కావాల్సింది కూడా. దేశం కోసం, ధర్మం కోసం.

కానీ కొంచెం లోతుగా సామాజిక రాజకీయాలు జరిగే తీరు చూస్తే, చంద్రబాబు నాయుడు, టీడీపీ, జగన్ రెడ్డి, వైసీపీ చాలా దశాబ్దాలుగా ఎస్టాబ్లిష్ అయిన పార్టీలు, రూలింగ్ క్లాసెస్. ఈ పార్టీల్లో ఒకరికి అధికారం పోతే, ఇంకో వర్గాన్ని తొక్కడానికి ప్రయత్నాలు చేయడం, లేదంటే ఆ వర్గాల దగ్గర రాజకీయంగా, రిసోర్సుల పరంగా పెద్ద వాటా తీసుకుని ఒక అండర్‌స్టాండింగ్‌లో పని చేయడం అందరం చూస్తున్నాం. వాళ్లు డామినేట్ క్లాస్ కాబట్టి, వాళ్లకి ఇలా పబ్లిక్‌లో బేలగా మాట్లాడాల్సిన అవసరం లేదు.

అయినా అమరావతి మీద జగన్ దాడి చేసినప్పుడు, చాలామంది చంద్రబాబుని విమర్శించిన వాళ్లే “ఈయన వల్ల మాకు ఈ కష్టం వచ్చింది” అని అన్నారు. ఇందాక చెప్పినట్టు వాళ్లందరూ మంచి రిసోర్స్‌ఫుల్ కాబట్టి వాళ్లకు వాళ్లే యుద్ధం చేయగలరు. రెడ్డి నాయకత్వంలో అమరావతి మీద దాడి జరుగుతుంటే, మేజర్‌గా కమ్మలు అందరూ ముందుండి పోరాటం చేశారు — కోర్టుల నుంచి టీవీ ఛానెల్స్, మీడియా వరకు.

అదే ఎప్పుడూ రూలింగ్ చేయని, ఒక అతి పెద్ద కులం, పెద్దగా రిసోర్సులు లేని వర్గం రాజకీయంగా చైతన్యం అవుతుంటే — థ్యాంక్స్ టు చిరంజీవి, అండ్ పవన్ కళ్యాణ్ — ఈ రెండు ఆధిపత్య వర్గాలు వాళ్లని ఎందుకు ఎదగనిస్తాయి? ఇలాంటి సందర్భంలో వాళ్లకి ఉన్న పెద్ద నాయకుడు రాష్ట్రంలో మీరే. దాంతో పాటు, దాడులు చేస్తుంది అలాంటి ఆధిపత్య వర్గం, అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ వర్గం, దాంతో పొత్తులో ఉన్న జెఎస్పీ. అప్పుడు పవన్ కళ్యాణ్‌ని అడగడం సహజం అన్నది కూడా గుర్తుంచుకోవాలి.

ఈ కామన్ సెన్స్ లేకుండా విషయాన్ని, సమస్యని పక్కదారి పట్టించడం, అలాంటి కుల సంఘ నాయకుల మీద ఎదురుదాడి చేస్తే రెండు రోజులు బాగుంటుంది, కానీ గ్రౌండ్‌లో సమస్యలు తీరవు. ఆ సమస్యలు వాస్తవం అయినంతకాలం అలాంటి కుల నాయకులకి విలువ ఉంటుంది. వాళ్లు తప్పు చేస్తే, వేరే రాజకీయ పార్టీల తరఫున, వైసీపీ తరఫున మాట్లాడితే వాళ్లకే విలువ పోతుంది. పడనాధ రెడ్డి గారిని చూసాం కదా, “రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే” అనేది అందుకే.

ఇంకా దాసరి రాము గారు ఆరోపించినట్టు, అంతా కీలక స్థానాల్లో కమ్మ వర్గానికి సంబంధించిన వాళ్లే ఉన్నారు, ఎవరికి చెప్పుకోవాలి అన్నారు. దీన్ని ఎలా చూడాలి? కళ్యాణ్ గారు అన్నారు, “కొంతమంది కాపుల్ని తెచ్చాం కదా (జేడీ, తోట చంద్రశేఖర్ మొదలైన వారు), వాళ్లు ఉండకుండా వెళ్లిపోతే ఉండేవాళ్లని పెట్టాం” అన్నారు. ఇది కూడా కరెక్టే.

రాజకీయ అనుభవం ఉండి, ఒక స్థాయి ఉన్న కాపు నాయకులు ఎందుకు రాలేదు జెఎస్పీకి? దాసరి రాము లాంటోళ్లు అడ్రెస్ చేస్తే చూడాలని ఉంది. కన్నా లక్ష్మీనారాయణ జెఎస్పీకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని వినికిడి వచ్చింది. ఆయన్ని మనోహర్ గారు మీట్ అయ్యి, టీడీపీలోకి ఎందుకు పంపారో? కన్నా గారికి పార్టీ బిల్డ్ చేసే అనుభవం, కెపాసిటీ ఉంది. పొత్తులో ఉన్న బీజేపీ నుంచి తీసుకోకూడదు అనుకున్నారు ఏమో.

కానీ ఇంకో ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీల్లో వర్గాలు ఉంటాయి. అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, జెఎస్పీ అయినా. ఎందుకంటే కొంతమందికి కొంతమందితో ఎక్కువ సాన్నిహిత్యం ఉండొచ్చు, వాళ్ల ఇంటరెస్టులు కలవొచ్చు, పోటీతత్వం ఉండొచ్చు. కొన్ని వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా కూడా గ్రూపిజం ఉంటుంది.

ఇలాంటి గ్రూపులకి ఇబ్బంది రాకుండా, సీనియర్ స్థాయిలో అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకుని పవర్ షేరింగ్ ఉంటుంది. అధ్యక్షుడు తర్వాత, ఆయనకి దగ్గరగా ఉండే ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న వాళ్లలో ఒక కమ్మ, ఒక కాపు, ఒక క్షత్రియ, ఒక ఎస్సీ/ఎస్టీ, కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇలా అన్ని వర్గాలకు పవర్ ఇస్తారు.

కానీ జెఎస్పీలో, బయట నుంచి చూసినా లేదా విన్న ఫీడ్‌బ్యాక్ ప్రకారం, ఒకే ఒక్క వ్యక్తికి అలాంటి అధికారం ఉంది. ఇది వర్కబుల్ సొల్యూషన్ కాదు. దాన్ని అడ్రెస్ ఎందుకు చేయలేదో ఆయనకే తెలియాలి.

కొంతమంది మనోహర్ గారి కన్నా సీనియర్లు అయ్యుంటారు, లేదా ఇంటెలెక్టువల్‌గా ఆయన కన్నా గొప్ప అనుకుని ఉండొచ్చు, లేదా ఆ సామాజిక వర్గం అని కొందరికి కంఫర్ట్ ఉండకపోవచ్చు, లేదా ఆ ప్రాంతంలో ఆయన గొప్ప నాయకుడిగా పేరొంది, చిన్న స్థాయి అనో, జూనియర్ అనో, ఏదైనా కారణం అవ్వొచ్చు వాళ్లకు కంఫర్టబుల్‌గా లేకపోవచ్చు. రాజకీయ పార్టీలో ఇది చాలా ముఖ్యమైన విషయం.

కళ్యాణ్ దీన్ని పీఎం పదవి ఉన్న వ్యక్తి నచ్చకపోయినా పని చేయట్లేదా అని పోల్చడం, అది హక్కు, రాజ్యాంగ పదవి, ఓటు వేసినా వేయకపోయినా ప్రజలందరికీ చెందిన వ్యక్తి. దానికి పార్టీలో పవర్ సెంటర్లకి కంపేర్ చేయడం అర్థం లేనిది. పార్టీలో పీఎంలాగా హక్కుగా ఏమీ ఉండదు. కానీ కంఫర్ట్ ఉన్నోళ్లని చూసుకుని వాళ్లతో కలిసి, పార్టీ పెద్ద లక్ష్యాల కోసం కొన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు పనిచేస్తారు.

దానికన్నా ముందు కొత్తగా జాయిన్ అవ్వాలన్నా, వాళ్లకి కంఫర్టబుల్‌గా, కాన్ఫిడెన్స్ ఇవ్వాలన్నా, అన్ని వర్గాల, ప్రాంతాల వారికి పవర్ షేరింగ్ (అధ్యక్షుడితో పూర్తి యాక్సెస్) ఉండాలి. అప్పుడు పార్టీ ఎదుగుతుంది. “నేను పెట్టిన వాడితోనే కలిసి పని చేయి, లేకపోతే వెళ్లిపో” అంటే, పార్టీ ఎందుకు ఎదగదో మళ్లీ ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చుకుంటారు.

నాకు తెలిసిన చిన్న ఉదాహరణ చెప్తా. కొన్ని ఏళ్ల క్రితం అత్యధిక మెంబర్‌షిప్ చేసిన అతి కొద్ది మందిని పార్టీ అధ్యక్షుడితో కలిపిస్తాం అన్నారు. తీరా ఆ మీటింగ్ కోసం అని పార్టీ ఆఫీస్‌కి వెళ్తే, కళ్యాణ్ గారి తర్వాత పవర్‌ఫుల్‌గా రాజకీయ వ్యవహారాలు చూసే వ్యక్తిని కలవాల్సి వచ్చింది. ప్రీ-స్క్రీనింగ్‌లాగా.

అలా కలిసినప్పుడు, మెంబర్‌షిప్ చేసిన ఒక వ్యక్తిని “ఏంటి నువ్వు ఈ కమ్యూనిటీ పైనా కామెంట్స్ చేశావంట” అంటూ వెటకారంగా, ట్రోల్ చేశారంట. అధ్యక్షుడితో మీటింగ్ కూడా జరగలేదంట. ఈ వ్యక్తిని అధ్యక్షుడి వరకు వెళ్లనీయకూడదు అనుకున్నారు ఏమో ఆయన. అలాంటి వ్యక్తిని కలవడానికి కళ్యాణ్‌కి ఇష్టం లేదేమో. ఆయనకి ఒక్కరికే క్యాన్సెల్ చేస్తే బాగుండదు అని అందరికీ క్యాన్సెల్ చేశారు.

ఇప్పుడు కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఇలాంటి కమ్యూనిటీ మీద నెగటివ్ ఒపీనియన్‌తో ఉండటం చాలా సహజం. అది ఒక చరిత్ర. ఇప్పుడు పార్టీ కోసం పనిచేసే అందరినీ ఇలాగే దూరం చేసుకుంటారా?

లేక ఆ పెద్ద మనిషి, “అరే, ఈ జిల్లాల్లో ఇలాంటి కామెంట్స్, ఒపీనియన్స్ సహజం. వాటిని మనం తగ్గించడానికి ప్రయత్నించి, పార్టీ కామన్ ఇంటరెస్ట్స్ కోసం పనిచేయాలి” అని మెచ్యూర్‌గా చెప్పి పార్టీ అధ్యక్షుడిని కలిపించి ఉంటే, ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఒక మెట్టు పైకి వెళ్లేది.

కానీ ఆయన ఒక సామాన్య కుల అభిమాని ఐడెంటిటీ తెచ్చిపెట్టుకుని ప్రవర్తించారు. అందుకనే, డిఫరెంట్ పవర్ షేరింగ్ పీపుల్ ఉంటే, ఆల్టర్నేట్ ఛానెల్‌లో అధ్యక్షుడిని రీచ్ అవుతారు. ఇది ఒక సాంపిల్ మాత్రమే. ఇలాంటివి మరి కొన్ని విన్నాం. ఇంకోసారి మాట్లాడుకుందాం.

పంచుకోండి

వ్యాఖ్యలు

ఒక్కసారి ఇమెయిల్ ధృవీకరణ అవసరం. ఆమోదించిన వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తాయి; ఇమెయిల్ చిరునామాలు కనిపించవు.

ఇంకా ఆమోదించిన వ్యాఖ్యలు లేవు.

Visits--